నామినేషన్ల కేంద్రాన్ని పరిశీలించిన డీఎస్పీ
KMM: బూర్గంపాడు ఎన్నికల దాఖలు ప్రక్రియ ప్రారంభమైంది. నాగినేనిప్రోలులో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని గురువారం పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగేందుకు తీసుకున్న భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు.