'విధి నిర్వహణలో చిత్తశుద్ధితో పనిచేయాలి'

SKLM: విధి నిర్వహణలో ప్రతి ఒక్కరు చిత్తశుద్ధితో పనిచేయాలని డ్వామా పీడీ సుధాకర్ అన్నారు. నందిగాంలో ఉపాధి పనుల సమగ్ర తనిఖీల ప్రజావేదికపై గరువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రోడ్డుకి ఇరువైపుల నాటిన మొక్కలను పెంచి ఉద్యాన వనాలుగా తీర్చి దిద్దాలని వాతావరణాన్ని చల్లబరిచే విధంగా చూడాలని కోరారు. ఉపాధి పనులతో చేపట్టిన ప్రతి పనిని సమగ్రవంతంగా పరిశీలించాలన్నారు.