'రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత'
E.G: ఉండ్రాజవరం మండలం చిలకపాడు గ్రామంలో మంగళవారం "రైతన్నా-మీ కోసం" కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఛైర్మన్ & నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు హాజరయ్యారు. రైతులతో మాట్లాడి పంట సాగులో కొత్త పద్ధతులు, సబ్సిడీలు, బీమా సౌకర్యాలపై అవగాహన కల్పించారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు.