నాలుగు పంచాయతీలకు నీరు: ఎమ్మెల్యే

ATP: కూటమి ప్రభుత్వంలో తాగునీటి పనులు శరవేగంగా సాగుతున్నాయని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు. నగరంలోని తపోవనంలో ఆర్. డబ్ల్యూ. ఎస్ వాటర్ పైప్ లైన్‌కు భూమి పూజ చేశారు. రూ. 97కోట్లతో పనులు చేపట్టామని, రెండు నెలల్లో పనులను పూర్తి చేస్తామని తెలిపారు. దీని ద్వారా 4 పంచాయతీలకు నీరు అందుతుందని పేర్కొన్నారు.