పెద్ద మనసు చాటుకున్న మాజీ ఎమ్మెల్యే

VSP: విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని 38వ వార్డుకు చెందిన ఒక పేద మార్వాడీ కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆర్థిక సహాయం అందించారు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న మలి సుభద్ర అనే మహిళ వైద్య ఖర్చుల నిమిత్తం ఆయన రూ. 5,000 శనివారం అందజేశారు. ప్రతి నెలా వైద్య ఖర్చులు తాను భరిస్తానని హామీ ఇచ్చారు.