స్థానిక పోరులో మూడు పార్టీలు సిండికేట్

స్థానిక పోరులో మూడు పార్టీలు సిండికేట్

WGL: ములుగులోని చల్వాయి గ్రామ సర్పంచ్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవంగా దక్కించుకుంది. ఈ గ్రామంలో మొత్తం 14 వార్డులను కాంగ్రెస్, BRS 4, BJP 3 చొప్పున పంచుకున్నాయి. ఉప సర్పంచ్ పదవిని BRSకు కేటాయించారు. రాజకీయాల్లో నిత్యం పోటీపడే ఈ పార్టీలు స్థానిక ఎన్నికల్లో స్నేహపూర్వకంగా వ్యవహరించడంతో పదవులు పంపకంలో శాశ్వాత మిత్రులు, శత్రువులు ఉండరని స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు.