జవహర్ నవోదయ విద్యాలయాల్లో దరఖాస్తుల ఆహ్వానం

జవహర్ నవోదయ విద్యాలయాల్లో దరఖాస్తుల ఆహ్వానం

WGL: జిల్లా పీఎంశ్రీ స్కూల్ జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి 9, 11వ తరగతుల్లో ప్రవేశాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని విద్యాలయ ప్రిన్సిపల్ బి. పూర్ణిమ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 23లోపు దరఖాస్తు చేసుకోవచ్చని, ఎంపిక పరీక్ష 2026 ఫిబ్రవరి 7న జరుగుతుందన్నారు. ఆసక్తి గల విద్యార్థులు పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని తెలిపారు.