ట్రైన్లో సీటు కోసం మహిళల కుస్తీ

రైలులో సీటు కోసం మహిళలు ఎంతో రిస్క్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముంబైలో లోకల్ ట్రైన్ కదులుతుండగా ట్రైన్‌లోకి ఆదరాబాదరాగా ప్రయాణికులు తోసుకుంటూ ఎక్కడం ఈ వీడియోలో చూడవచ్చు. ఆ సమయంలో ఏ కాస్త పొరపాటు జరిగినా తీవ్ర ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడమే అవుతుంది. జస్ట్ మిస్ అయినా.. ప్రాణాలకే ప్రమాదమని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.