ఓటములకు సమిష్టి బాధ్యత వహించాలి: రవిశాస్త్రి
టీమిండియా గత కొంత కాలంగా టెస్టుల్లో పేలవ ప్రదర్శన చేస్తోంది. సొంత గడ్డపై న్యూజిలాండ్, సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌లను కోల్పోయింది. దీంతో కోచ్ గంభీర్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అయితే, ఈ ఓటములకు కేవలం కోచ్ ఒక్కడే కాదు, భారత జట్టు మొత్తం సమిష్టిగా బాధ్యత వహించాలని మాజీ కోచ్ రవిశాస్త్రి అన్నాడు. ఓటములకు ఒక్కరినే నిందించడం తగదని ఆయన పేర్కొన్నాడు.