వెంకటేశ్వర స్వామి వైభవంపై ప్రవచనాలు
VSP: జిల్లా ఎంవీపీ కాలనీ భద్రం సామాజిక భవనంలో జరుగుతున్న నాలుగు రోజుల వెంకటేశ్వర వైభవ ప్రవచనాల్లో మూడో రోజు శుక్రవారం రాత్రి ఆకెళ్ల విభీషణ శర్మ సత్సంగత్యం ప్రాముఖ్యతను వివరించారు. ధర్మచింతన, సత్సంగతే కలియుగ దోషాల నుంచి రక్షిస్తాయని తెలిపారు. శ్రీనివాసుడి అవతారం తదితర ఆధ్యాత్మిక విశేషాలతో భక్తులను ఆకట్టుకున్నారు.