'రేపు పిఠాపురంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం'
KKD: పిఠాపురం ప్రాంతాభివృద్ధి ప్రాధికార సంస్థ (PADA) కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పీడీ శ్రీనివాసరావు తెలిపారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:00 గంట వరకు అర్జీదారుల నుంచి వినతులు స్వీకరిస్తామని, ఆన్‌లైన్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలు వినియోగించుకోవాలన్నారు.