సోలార్ సైకిల్ ట్రాక్ దుర్వినియోగం.. పట్టించుకోని HMDA

సోలార్ సైకిల్ ట్రాక్ దుర్వినియోగం.. పట్టించుకోని HMDA

HYD: అవుటర్ రింగ్ రోడ్డు పక్కన దాదాపు రూ. 100 కోట్లతో నిర్మించిన సోలార్ సైకిల్ ట్రాక్ దెబ్బతింటోంది. ఈ ట్రాక్‌ను తరచూ ప్రైవేట్ కార్యకలాపాలకు వినియోగిస్తున్నా HMDA అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. తాజాగా కొందరు కుటుంబ కార్యక్రమానికి ట్రాక్‌ను వాడుకుంటున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ దృశ్యాలను చూసి నెటిజన్లు సైతం మండిపడుతున్నారు.