క్రీడాకారులను సత్కరించిన టీడీపీ నేతలు
AKP: అచ్యుతాపురం మండలం నునపర్తిలో బాల్ బ్యాట్మెంటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయంగా రాణించిన క్రీడాకారులను టీడీపీ సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పప్పల చలపతిరావు గురువారం సత్కరించారు. అంతర్జాతీయ క్రీడాకారులు యువతకు క్రీడల్లో ప్రోత్సాహాన్ని అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం టీడీపీ పరిశీలకులు బొండా జగన్నాథం పాల్గొన్నారు.