VIDEO: పంచాయతీ కార్మికుల అర్థనగ్న ప్రదర్శన

VIDEO: పంచాయతీ కార్మికుల అర్థనగ్న ప్రదర్శన

NRML: కడెం మండలంలోని కన్నాపూర్ గ్రామపంచాయతీ కార్మికులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. కడెంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట అర్థనగ్న ప్రదర్శన నిర్వహించి సిబ్బందికి వినతి పత్రాన్ని సమర్పించారు. ఐఎఫ్టీయు జిల్లా అధ్యక్షులు రాజేష్ మాట్లాడుతూ.. పంచాయతీ కార్మికులకు వేతనాలు రాకపోవడంతో పస్తులు ఉండే పరిస్థితి నెలకొందన్నారు. వెంటనే వారికి జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.