మధిర మున్సిపల్ కార్యాలయంలో డిప్యూటీ సీఎం తనిఖీ

మధిర మున్సిపల్ కార్యాలయంలో డిప్యూటీ సీఎం తనిఖీ

KMM: మధిర మున్సిపల్ కార్యాలయాన్ని మంగళవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆకస్మికంగా తనిఖీ చేశారు. సర్పంచుల అభినందన సభ అనంతరం ఆయన నేరుగా మున్సిపల్ కార్యాలయానికి వెళ్లారు. కార్యాలయంలో కలియ తిరిగి మున్సిపల్ కమిషనర్, సిబ్బందితో పలు అంశాలపై చర్చించారు. ప్రజా పాలన కింద వచ్చిన దరఖాస్తులు వాటిని పరిష్కరిస్తున్న తీరుపై ఆరా తీశారు.