VIDEO: నూతన భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి
యాదాద్రి: మూటకొండూరు మండల కేంద్రంలో తహసీల్దార్, మండల ప్రజాపరిషత్ కార్యాలయాల నిర్మాణ పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తుందని పేర్కొన్నారు.