'చట్టపరమైన మార్గంలో ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాం'
మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో నిన్న ప్రజా విజ్ఞప్తుల దినం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చట్టపరమైన మార్గంలో ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఎవరి జోక్యం లేకుండా నిర్భయంగా సమస్యలు వెల్లడించాలని పేర్కొన్నారు.