పవన్ కళ్యాణ్‌పై అభిమానం.. బిడ్డకు పవన్ కళ్యాణ్‌గా నామకరణం

పవన్ కళ్యాణ్‌పై అభిమానం.. బిడ్డకు పవన్ కళ్యాణ్‌గా నామకరణం

బాపట్ల: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై ఆయన అభిమాని నాయన వెంకటరెడ్డి తన పుట్టిన బిడ్డకు పవన్ కళ్యాణ్‌ పేరు పెట్టి తన అభిమానాన్ని చాటుకున్నారు. చీరాల మున్సిపాలిటీలో 28వ వార్డుకు చెందిన పవన్ కళ్యాణ్ అభిమాని నాయని వెంకటరెడ్డి, కావ్య దంపతులు మగబిడ్డకు ఇటీవల జన్మనిచ్చారు. పవన్ కళ్యాణ్‌పై అభిమానంతో పుట్టిన బిడ్డకు శుక్రవారం పవన్ కళ్యాణ్ అని నామకరణం చేశామన్నారు.