'ఆంధ్ర' పేరు మార్పును వ్యతిరేకించిన శ్రీనివాస్

'ఆంధ్ర' పేరు మార్పును వ్యతిరేకించిన శ్రీనివాస్

E.G: ఆంధ్రప్రదేశ్‌ను 'తెలుగు నాడు'గా మార్చాలనే వ్యాఖ్యలను RCP అధినేత మేడా శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్ర అనే పదానికి చారిత్రకంగా, సాంస్కృతికంగా ప్రత్యేక స్థానం ఉందన్నారు. నన్నయ, పోతన వంటి మహాకవులు ఆంధ్ర మహాభారతం, ఆంధ్ర మహాభాగవతాన్ని రచించారని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ పేరు మార్చేలా వ్యాఖ్యలు చేయడం తగదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.