భువనగిరి కలెక్టరేట్లో జెండా ఆవిష్కరించిన కలెక్టర్

యాదాద్రి: 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆవిష్కరించారు. అంతకుముందు మహాత్మా గాంధీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని కలెక్టర్ స్వీకరించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు, తదితరులు పాల్గొన్నారు