మంగళగిరి నరసింహుడి ఆలయ పదవుల కోసం పోటీ

GNTR: రాష్ట్రంలోని దేవాలయాల్లో పాలకవర్గాల పదవుల భర్తీ కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో మంగళగిరి లక్ష్మీ నరసింహాస్వామి ఆలయ పదవుల కోసం ఆశావహులు ఎక్కువగా ఉన్నారు. జిల్లాలోనే ప్రముఖ పుణ్యక్షేత్రం కావడంతో పోటీ తీవ్రంగా ఉంది. ఆశావహులు ఎవరికి వారు పదవి దక్కించుకునేందుకు పార్టీ పెద్దల నుంచి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.