కళ్యాణ వేడుకల్లో పాల్గొన్న గ్రంథాలయ ఛైర్మన్
MLG: జిల్లా కేంద్రంలోని బండారుపల్లి గ్రామంలోని రామాలయంలో శుక్రవారం శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవానికి ముఖ్యఅతిథిగా జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ బానోతు రవి చందర్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్వామివారి ఆశీస్సులతో ములుగు నియోజకవర్గం అభివృద్ధి చెందాలని కోరుకున్నారు.