VIDEO: కాంగ్రెస్ ప్రభుత్వం పై పాలకుర్తి రైతు ఆగ్రహం
JN: పాలకుర్తి పట్టణ కేంద్రానికి చెందిన ఓ రైతు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో పుష్కలంగా నీళ్లు వచ్చేవని, రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక పరిస్థితి ఘోరంగా మారిందని ఆయన వాపోయాడు. రైతు బంధు లేదు, సాగునీరు లేదు 4 ఎకరాలు వేసిన పంటలో 3 ఎకరాలు ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.