వినుకొండ అభివృద్ధికి కృషి చేస్తాం: MLA జీవి
PLD: వినుకొండ అభివృద్ధే తన లక్ష్యమని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు స్పష్టం చేశారు. ఆదివారం వినుకొండలో మీడియాతో మాట్లాడుతూ.. జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఈ నెల 7న జిల్లా ఎమ్మెల్యేలమంతా కలిసి సీఎం చంద్రబాబును కలిసి, అభివృద్ధి పనులపై సమగ్ర నివేదిక అందజేస్తామని ఆయన వెల్లడించారు.