వీధులలో ముగిసిన హరిదాసు కీర్తనలు
VZM: కొత్తవలస పట్టణ కేంద్రంలో నెలరోజుల నుంచి వీధులన్నీ మారుమ్రోగిన హరిదాసు కీర్తనలు శుక్రవారంతో ముగిసింది. ప్రతి సంవత్సరం నెలగంట ఆరంభం నుంచి పట్టణంలోని పలు వీధులలో కీర్తనలు పాడుకుంటూ హరిదాసు బియ్యం సేకరణ చేస్తారు. హరిదాసు కీర్తనలకు పిల్లలు ఆసక్తిగా తిలకించి, హరిదాసుకు కానుకలు సమర్పిస్తారు. ఆఖరిరోజు కావడంతో అధిక సంఖ్యలో పిల్లలు, పెద్దలు పాల్గొన్నారు.