అందమైన జలపాతం.. అజాగ్రత్తగా ఉంటే తప్పదు ప్రమాదం
ASR: కొయ్యూరు మండలంలోని గాదెగుమ్మి జలపాతం వద్దకు ఇతర ప్రాంతాల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. జలపాతానికి వెళ్లే రహదారిలో హెచ్చరికలతో కూడిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశామని సీఐ బీ. శ్రీనివాసరావు, ఎస్సై పీ.కిషోర్ వర్మ బుధవారం తెలిపారు. జలపాతానికి దగ్గరగా వెళ్లవద్దని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.