కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే
HNK: హసన్‌పర్తి మండలం వంగపహాడ్, నాగారం గ్రామాల్లో ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రాలను వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశానికి వెన్నెముక రైతు అని, రైతు సంక్షేమానికి ప్రజాప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. రైతులు దళారుల మాటలు నమ్మి మోసపోకుండా కొనుగోలు కేంద్రాల్లోనే మక్కలను విక్రయించాలన్నారు.