ప్రసిద్ధ వైష్ణవక్షేత్రంగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయం
JGL: తెలంగాణలోని ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ప్రసిద్ధ వైష్ణవక్షేత్రంగా గుర్తింపు పొందింది. ధర్మపురిలో గోదావరి నది తీరంలో వెలసి భక్తులను ఆకర్షిస్తోంది. ఈ ఆలయంలో లక్ష్మీ నరసింహస్వామి ఉగ్రరూపంలో దర్శనమిస్తారు. ఇక్కడ స్వామివారిని దర్శిస్తే భయాలు, కష్టాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. జీవితంలో ఒకసారైనా దర్శించాల్సిన పుణ్యక్షేత్రంగా ధర్మపురి ఆలయం ప్రసిద్ధి చెందింది.