కనక మహాలక్ష్మి సన్నిధిలో అరకు ఎమ్మెల్యే
విశాఖపట్నం పూర్ణా మార్కెట్ పరిధిలోని బురుజుపేటలో కొలువై ఉన్న కనక మహాలక్ష్మి అమ్మవారిని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం శుక్రవారం దర్శించుకున్నారు. ఎమ్మెల్యేకు ఆలయ అర్చకులు, స్థానిక నేతలు ఘనంగా స్వాగతం పలికారు. కనక మహాలక్ష్మి అమ్మవారికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలపై ఉండాలని కోరుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.