నేడు ఎమ్మెల్యే బండారు పర్యటన వివరాలు

కోనసీమ: కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు గురువారం పర్యటన వివరాలు ఆయన కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ఉదయం 11 గంటలకు వాడపల్లి శ్రీ వెంకటేశ్వరస్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న పవిత్రోత్సవాల్లో పాల్గొంటారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొనాలని సూచించారు.