లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు

MLG: మంగపేట మండలం మల్లూరు లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచి భక్తుల రద్దీ నెలకొంది. చింతామణి జలధార వద్ద పుణ్యాస్నానాలు ఆచరించి స్వామివారిని భక్తులు దర్శించుకుంటున్నారు. అనంతరం ఆలయ చరిత్ర వివరించారు.