‘రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు’
AP: రాష్ట్రాన్ని 'అప్పుల ఆంధ్రప్రదేశ్'గా మార్చేశారని మాజీమంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. కూటమి పాలనలో జనం కొనుగోలు శక్తి తగ్గిపోయిందని, రాష్ట్రం దివాలా తీసే పరిస్థితికి వచ్చిందన్నారు. గతంలో ఏపీ శ్రీలంక అవుతుందని విమర్శించిన CBN.. ఇప్పుడు రూ.లక్షల కోట్లు అప్పు తెచ్చి ఏం చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. అన్ని రంగాల్లో రాష్ట్రం వెనుకబడిపోయిందని దుయ్యబట్టారు.