సీఎం స్వగ్రామంలో ఏకగ్రీవానికి కసరత్తు

సీఎం స్వగ్రామంలో ఏకగ్రీవానికి కసరత్తు

NGKL: సీఎం రేవంత్ స్వగ్రామం అయిన వంగూరు మండలం కొండారెడ్డిపల్లి పంచాయతీని ఏకగ్రీవం చేసేందుకు స్థానిక నాయకులు కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సర్పంచి స్థానం ఎస్సీకి రిజర్వు అయింది. దీంతో గ్రామస్తులంతా సర్పంచిగా మల్లెపాకుల వెంకటయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు తీర్మానించినట్లు సమాచారం. వార్డు సభ్యుల పదవులకు కూడా ఒక్కో నామినేషన్ దాఖలు చేయించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.