మొగిలిచర్ల హెచ్ఎం జాతీయస్థాయి అవార్డు

మొగిలిచర్ల హెచ్ఎం జాతీయస్థాయి అవార్డు

NLR: విజయవాడలో మంగళవారం జరిగిన జాతీయస్థాయి ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమంలో లింగసముద్రం మండలం మొగిలిచర్ల జడ్పీ హైస్కూల్ హెచ్ఎం సూర్యప్రకాష్ రావు 'ట్రైబల్ ఫోటో ఆఫ్ ది ఇయర్' అవార్డును అందుకున్నారు. టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ లోకసాని బాలాజీ, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని స్వీకరించారు.