పెద్దపులి కలకలం.. ప్రజలకు ఎమ్మెల్యే సూచనలు

పెద్దపులి కలకలం.. ప్రజలకు ఎమ్మెల్యే సూచనలు

AP: అల్లూరి(D) రాజవొమ్మంగి(M)లో పెద్దపులి కలకలం రేపింది. దీంతో రంపచోడవరం ఎమ్మెల్యే శిరీష ప్రజలను అప్రమత్తం చేశారు. ఉర్లాకులపాడు గ్రామ సమీపంలో పెద్దపులి సంచరిస్తుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సా.6 నుంచి ఉ.6 గంటల వరకు బయటకు రావొద్దని తెలిపారు. పశువులను అడవి ప్రాంతానికి తీసుకెళ్లవద్దని హెచ్చరించింది. పులి సంచారంపై అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు చెప్పారు.