ప్రపంచస్థాయి నగరంగా అమరావతి: స్వామి

ప్రకాశం: అమరావతి పున:ప్రారంభం సభకు వచ్చిన జన సందోహం చూసి వైసీపీ నేతలకు కళ్లు బైర్లు కమ్మాయని మంత్రి స్వామి అన్నారు. శనివారం మర్రిపూడిలో నిర్వహించిన రెవెన్యూ గ్రీవెన్స్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రూ.49 వేల కోట్ల పనులతో అమరావతికి పునరుజ్జీవం వచ్చిందని అన్నారు. ప్రధాని మోదీ సహకారం, సీఎం చంద్రబాబు విజన్‌తో ప్రపంచ స్థాయి నగరంగా అమరావతి నిలుస్తుందని అన్నారు.