సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎంపీ

సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎంపీ

ఖమ్మం జిల్లా బుర్హాన్ పురంలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం సీఎంఆర్ఎఫ్ చెక్కులను రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన రూ. 5.50 లక్షల విలువైన చెక్కులను 15 మంది బాధితులకు అందజేశారు. పలు అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చికిత్స పొంది, కోలుకున్న బాదితులను పరామర్శించి, వారి యోగక్షేమాలను ఆయన అడిగి తెలుసుకున్నారు.