'చిత్తూరు జిల్లాలో యూరియా కొరత లేదు'

'చిత్తూరు జిల్లాలో యూరియా కొరత లేదు'

CTR: జిల్లాలో యూరియా కొరత లేదని రైతులు ఆందోళన చెందవద్దని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీకృష్ణ అన్నారు. ఇప్పటివరకు 12,500 టన్నుల యూరియాను పంపిణీ చేయడం జరిగిందన్నారు. 1000 టన్నుల యూరియా అందుబాటులో ఉందని, 2,500 టన్నుల యూరియా కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామన్నారు. భూసారాన్ని బట్టి యూరియాను వాడాలని, అధికంగా వాడితే భూమి సారాన్ని కోల్పోతుందన్నారు.