'CPI రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలి'

TPT: ఈ నెల 23 నుంచి 25 వరకు ఒంగోలులో జరగనున్న CPI రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని జిల్లా కార్యదర్శి మురళి పిలుపునిచ్చారు. తిరుపతిలో ఆదివారం ముగిసిన జన సేవాదళ్ శిక్షణ శిబిరం అనంతరం ఆయన ఈ పిలుపునిచ్చారు. మహాసభల సందర్భంగా 23న ఒంగోలులో జరిగే ప్రదర్శనలో రెడ్ షర్ట్ వాలంటీర్ల కవాతులో జిల్లా నుంచి వందలాది మంది కార్యకర్తలు పాల్గొనాలని ఆయన కోరారు.