CMRF చెక్కు అందజేత
BPT: యద్దనపూడి మండలం పూనూరు గ్రామానికి చెందిన గోదాసి రాజ్యలక్ష్మికి అత్యవసర వైద్య చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ. 6 లక్షలు మంజూరయ్యాయి. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సిఫారసుతో ఎల్‌వోసీ ద్వారా రాజ్యలక్ష్మికి ఈ ఆర్థిక సహాయం అందించబడింది. ఈ సందర్భంగా క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నాయకులు, కార్యాలయ ప్రతినిధులు ఈ చెక్కును అందజేశారు.