ఎమ్మార్వో కార్యాలయం వద్ద అంగన్వాడీల నిరసన

ఎమ్మార్వో కార్యాలయం వద్ద అంగన్వాడీల నిరసన

GNTR: తుళ్లూరు ఎమ్మార్వో కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు గురువారం నిరసన కార్యక్రమం చేపట్టారు. సీఐటీయూ అమరావతి నాయకుడు భాగ్యరాజు ఆధ్వర్యంలో అంగన్వాడీలు ఎమ్మార్వోకు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. తమ దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని కోరిన అంగన్వాడీలు, పని భారాన్ని తగ్గించాలని, వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు.