'గ్రామాల పరిశుభ్రతకు స్వచ్ఛరథం దోహదం'

'గ్రామాల పరిశుభ్రతకు స్వచ్ఛరథం దోహదం'

AKP: గ్రామాల పరిశుభ్రతకు స్వచ్ఛరథం దోహదపడుతున్నట్లు పాయకరావుపేట ఎంపీడీవో లవరాజు అన్నారు. శుక్రవారం ఎన్ నరసాపురం, పాల్తేరు గ్రామస్తులకు స్వచ్ఛరథంపై అవగాహన కల్పించారు. ఇందులో ప్లాస్టిక్ వ్యర్ధాలు, పనికిరాని ఇనప వస్తువులు, చిత్తు కాగితాలను తీసుకుని అవసరమైన నిత్యవసర సరుకులను అందజేయడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.