కాణిపాకం దేవస్థానానికి భారీ విరాళం

కాణిపాకం దేవస్థానానికి భారీ విరాళం

CTR: కాణిపాకంలోని స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం నిత్య అన్నదానం ట్రస్ట్‌కు విజయవాడకు చెందిన శ్రీనివాసరావు, హిమబిందు దంపతులు రూ.1,01,116 విరాళంగా అందించారు. ఈ సందర్భంగా దేవస్థానం ఈవో పెంచల కిషోర్ దాతలకు ప్రత్యేక దర్శనం కల్పించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.