VIDEO: ట్రాక్టర్ బోల్తా.. పోలీసుల రెస్క్యూ
CTR: కార్వేటినగరం మండలం సురేంద్రనగరం కనుమ వద్ద ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు మృతిచెందిన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇటుకలతో నిండిన ట్రాక్టర్ ట్రాలీ కింద పడ్డ మృతదేహాలను చూసి స్థానికులు కలత వ్యక్తం చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.