ఈనెల 31న బహిరంగ వేలం
VZM: జిల్లా పోక్సో కోర్టులో వివిధ క్రిమినల్ కేసులకు సంబంధించి ప్రభుత్వం జప్తు చేసిన మొబైల్ ఫోన్లను ఈనెల 31న బహిరంగ వేలం వేయనున్నట్లు కోర్టు కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈనెల 31 సాయంత్రం 4:30 గంటలకు కోర్టు ప్రాంగణంలోనే వేలం నిర్వహిస్తామని, ఆసక్తి గల వ్యక్తులు నిర్ణీత సమయంలో వేలంలో పాల్గొనవచ్చని అధికారులు తెలిపారు.