ఆఫ్ఘాన్‌కు భారత్ వైద్య సాయం

ఆఫ్ఘాన్‌కు భారత్ వైద్య సాయం

ఆఫ్ఘాన్‌కు భారత్ మానవతా సాయం చేసింది. ఆ దేశానికి మందులు, టీకాలు, ఇతర వైద్య పరికరాలను ప్రత్యేక విమానం ద్వారా పంపించింది. తక్షణ ఆరోగ్య అవసరాలను తీర్చడానికి ఈ సాయం అందిస్తున్నట్లు భారత్ వెల్లడించింది. ఇటీవల పాక్ జరిగిన వైమానికి దాడిలో 9 మంది చిన్నారులు మరణించారు. ఈ దాడిలో గాయపడిన వారికి సాయం చేసేందుకే వీటిని భారత్ అందించింది.