ఈవీఎం గోదాంను తనిఖీ చేసిన కలెక్టర్

ఈవీఎం గోదాంను తనిఖీ చేసిన కలెక్టర్

NGKL: జిల్లాలో నిర్వహిస్తున్న నెలవారీ తనిఖీల కార్యక్రమంలో భాగంగా వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి సోమవారం ఈవీఎం గోదాంను జిల్లా కలెక్టర్ సంతోష్ పరిశీలించారు. గోదాంలో భద్రపరచిన ఈవీఎంల భద్రతా ఏర్పాట్లను కలెక్టర్ వివరంగా పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరు, డబుల్ లాక్ వ్యవస్థ వంటి కీలక అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు.