వైద్య సిబ్బందికి కుర్చీలు వితరణ

వైద్య సిబ్బందికి కుర్చీలు వితరణ

VZM: కొత్తవలస మండలం గులివిందాడ గ్రామ పంచాయతీలో గ్రామ ప్రజలకు ప్రతినెల రెండో శనివారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆద్వర్యంలో దీర్ఘకాలిక రోగులకు ఆరోగ్య చికిత్సలు నిర్వహిస్తారు. వచ్చిన రోగులకు, వైద్య సిబ్బందికి కూర్చోవడానికి కుర్చీలు లేకపోవడంతో నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామానికి చెందిన జీ.శివశంకరరావు స్పందించి ఎనిమిది కుర్చీలను శనివారం అందజేశారు.