పైప్‌లైన్ లీకుతో అవస్థలు

పైప్‌లైన్ లీకుతో అవస్థలు

KDP: సిద్ధవటం మండలంలోని మాధవరం-1లో ప్రైవేట్ పాఠశాల సమీపంలో రహదారి అద్వానంగా మారింది. 2నెలల కిందట JCBతో పారిశుధ్య పనులు చేస్తుండగా మంచినీటి పైపులైను దెబ్బతింది. దీంతో నీరు లీకవుతూ రహదారి చిత్తడిగా మారడంతో రాకపోకలకు ఇబ్బందికరంగా ఉన్నాయని స్థానికులు చెప్పారు. పైపులైనుకు మరమ్మత్తులు చేసి నీటి వృధాను అరికట్టాలని వారు కోరారు.