దుక్కిటెద్దు అనుమానాస్పద మృతి

దుక్కిటెద్దు అనుమానాస్పద మృతి

ASR: పెదబయలు మండలం బొంగరం గ్రామంలో దుక్కిటెద్దు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. గ్రామానికి చెందిన రైతు బొంగరం చిట్టినాయుడుకు చెందిన ఎద్దు నోటి నుంచి నురగ వచ్చి నిమిషాల వ్యవధిలోనే ప్రాణాలు విడిచింది. సాగు పనులకు ఆసరాగా ఉన్న ఎద్దు అకస్మాత్తుగా చనిపోవడంతో ఆ రైతు కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది.